నల్గొండ జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు

నల్గొండ జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు

NLG: జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ నుంచి ప్రతిరోజు 400 నుంచి 600 ఓపీ వరకు నమోదవుతున్నాయి.