రేషన్ బియ్యం నిల్వ.. కేసు నమోదు

రేషన్ బియ్యం నిల్వ.. కేసు నమోదు

ఎన్‌టీఆర్ జిల్లా డీఎస్ఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో తిరువూరు(M) జి. కొత్తూరు గ్రామంలోని రేషన్ షాప్‌ను PDSDT, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేశారు. అయితే రేషన్ బియ్యం వేరే ఇంటిలో నిల్వ ఉంచడంతో 65 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు నిల్వ ఉంచినట్లు గుర్తించి సంబంధిత వ్యక్తిపై 6A కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.