సంక్రాంతికి సిద్ధమవుతున్న పందెం కోళ్లు

సంక్రాంతికి సిద్ధమవుతున్న పందెం కోళ్లు

AP: సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, అక్కడి కోడి పందేలు. రూ.లక్షల మొత్తంలో చేతులు మారే ఈ పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు తమ డేగ, కాకి డేగ, కొక్కిరాయి తదితర పందెం కోళ్లకు తర్ఫీదిస్తున్నారు. కడుపుకు మేతతో పాటు బరిలో దిగాక చురుగ్గా ఉండేందుకు వాటితో ఈత కొట్టించడం, స్పెషల్ వర్కవుట్స్ కూడా చేయిస్తుంటారు.