ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా

SRPT: సూర్యాపేటలోని కలెక్టరేట్ ముందు ఐకేపీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలు ప్రారంభమై రెండు నెలలవుతున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.