'ఏనుగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'ఏనుగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి'

PPM: నందివానివలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.