జిల్లాలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు: ఎస్పీ
వనపర్తి జిల్లాలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు నుంచే నిఘా పెట్టడం జరుగుతుందని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. ఎఫ్ఎస్‌టీ బృందాల్లో అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రంలో 100 మీటర్ల లోపు ఎవర్ని అనుమతించేది లేదన్నారు.