VIDEO: 'ఆశాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి'

VIDEO: 'ఆశాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి'

SRPT: ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కార్యాలయంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల హామీ ప్రకారం రూ. 18 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు సమ్మె చేస్తున్నారని అన్నారు.