VIDEO: దర్శిలో గణేష్ విగ్రహాల కొనుగోళ్లు జోరు

ప్రకాశం: దర్శిలో వినాయక చవితి పండుగకు పది రోజుల ముందుగానే గణేష్ విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. యువకులు, మండపాల నిర్వాహకులు తమకు నచ్చిన విగ్రహాలను ముందస్తు రుసుము చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తయారీ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విగ్రహాల ధరలు పెరిగాయని కొనుగోలుదారులు తెలిపారు.