ఎస్ రాయవరం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్
AKP: ఎస్ రాయవరం ఎస్సైగా రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కోటవురట్ల ఎస్సైగా పనిచేస్తున్న ఎస్సై రమేష్‌ను అధికారులు ఎస్ రాయవరం బదిలీ చేశారు. అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న విభీషణరావును అనకాపల్లి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన రమేష్ మర్యాదపూర్వకంగా సీఐ రామకృష్ణను కలిశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.