మద్యం దుకాణాలు బంద్

KRNL: శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగున్న నేపథ్యంలో ఫిబ్రవరి 24వ తేది సాయంత్రం నుంచి 27వ తేది సాయంత్రం వరకు సున్నిపెంట పట్టణంలో మద్యం దుకాణాలు బంద్ చేయించనున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వి.రాముడు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ నేతృత్వంలో సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహిస్తారు.