'రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'
SRCL: అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం అన్నారు. 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీలో రోడ్డు భద్రతపై ఎస్సై ఉపేంద్ర చారితో కలిసి ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని సూచించారు.