వీరభద్ర కాలనీలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట వీరభద్ర కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువ నాయకులు లీడర్ రఘు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అందిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టారని వెల్లడించారు.