వరద బాధితులకు నిధుల విడుదల

కామారెడ్డి నియోజకవర్గంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం కింద నిధులు విడుదలైనట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని జీఆర్ కాలనీలో 45 కుటుంబాలకు, కౌండిన్య కాలనీలో 22 కుటుంబాలకు మొత్తం 67 ఇళ్ల మరమ్మతులకు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం రూ.11,500 బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.