ఫుట్‌బోర్డ్ ప్రయాణాన్ని నిర్లక్ష్యంగా చూడలేం: హైకోర్టు
బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముంబై సబర్బన్ రైల్లో ప్రయాణిస్తూ డోర్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతడి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు. రద్దీ సమయంలో మరో మార్గం లేక డోర్ దగ్గర బాధితుడు అలా నిలబడాల్సి వచ్చిందని, దీన్ని నిర్లక్ష్యంగా పరిగణించలేమని పేర్కొంది. పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.