సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా సామ తిరుపతిరెడ్డి
SRCL: వేములవాడ రూరల్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా సామ తిరుపతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల మొదటి విడత జరిగిన ఎన్నికల్లో వేములవాడ రూరల్ మండలంలో ఎన్నికైన సర్పంచులు కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.