దీక్ష దివాస్ వేడుకల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం కాలోజీ విగ్రహం ఎదుట ఇవాళ దీక్షా దివాస్ వేడుకల వాల్ పోస్టర్లను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్షల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన విషయం చరిత్రలో లిఖించదగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.