‘సీఎం పర్యటనకు 900 సిబ్బందితో బందోబస్తు’
ADB: CM రేవంత్ రెడ్డి ADB పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా SP అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 900 మంది సిబ్బందిని 9 సెక్టర్లుగా విభజించి హెలిప్యాడ్, సభాస్థలం, ట్రాఫిక్, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించనున్నారు.