VIDEO: మద్యం మత్తులో మందు బాబు హల్చల్
అన్నమయ్య: రాయచోటి బంగ్లా సర్కిల్ వద్ద ఆదివారం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బీరు బాటిల్ పగలగొట్టి, గాజు ముక్కలతో వాహనాలను ఆపుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.