లాడ్జిలలో అర్ధరాత్రి పోలీసుల విస్తృత తనిఖీలు
ప్రకాశం: కనిగిరిలోని పలు లాడ్జిలలో గురువారం అర్ధరాత్రి ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జిల్లో రికార్డులను ఎస్సై పరిశీలించారు. లాడ్జిలలో బస చేసిన వారి ఐడీలను ఎస్సై పరిశీలించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ... లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.