పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
PLD: చెరుకుపల్లిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను ఆయన తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షలు పారదర్శకంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.