'వసంత పంచమి ఏర్పాట్లపై సమీక్ష'
ADB: బాసరలో ఈనెల 23న జరిగే వసంత పంచమి వేడుకల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం అధికారులతో సమీక్షించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గోదావరి ఘాట్ వద్ద బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని, రద్దీకి తగ్గట్లు బస్సులు నడపాలని సూచించారు.