VIDEO: నేడు దొరవేషంలో సందడి చేయనున్న భక్తులు

TPT: తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. 3వ రోజు శుక్రవారం భక్తులు 'తోటి వేషం' ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి గంగమ్మకు నైవేద్యం సమర్పించారు. శనివారం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి గంగమ్మకు సారె తీసుకురానున్నారు. ఇవాళ దొర వేషంలో వేయనున్నారు.