‘ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న పేదలు’

HYD: చికిత్స కోసం బస్తీ దవాఖానాల కోసం వస్తే కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని, వాటి కోసం రోజుల తరబడి పేదలు తిరుగుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి శంకర్ అన్నారు. హనుమాన్‌నగర్, వెంకటేశ్వరనగర్, ఆస్‌బెస్టాస్ కాలనీల్లోని బస్తీ దవాఖానాల్లో సరైన సౌకర్యాలు లేవన్నారు. రక్త పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించటం లేదన్నారు.