పేకాట స్థావరాలపై దాడి.. 15 మంది అరెస్ట్
ELR: పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డీగూడెంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఎస్సై శారద సతీష్ నిన్న ఆకస్మిక దాడులను నిర్వహించారు. 15 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 1,12,400లు నగదు, 15 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.