అల్లూరి సీతారామరాజుకు కలెక్టర్ నివాళి

అల్లూరి సీతారామరాజుకు కలెక్టర్ నివాళి

సత్యసాయి: పుట్టపర్తి మండలంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ గురువారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అల్లూరి దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ సైనికులతో పోరాడి, 26ఏళ్ల వయసులోనే వీరమరణం పొందిన తీరును స్మరించుకున్నారు.