కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన చల్ల
CTR: పుంగనూరు ప్రజల దాహార్తి, పంటలకు నీటిని అందించేందుకే గుండమ్మ చెరువుకు కృష్ణా జలాలను తీసుకువచ్చినట్లు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణ సమీపంలోని పుంగమ్మ చెరువు 50 రాళ్ల మరవ వద్ద పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చిన తర్వాత మరువను విడిచారు. రాయల చెరువును కూడా నింపుతామన్నారు.