'ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుంది'
VSP: గాజువాక ఉక్కునగరం సీ భవన్‌లో ఆదివారం కరాటే గ్రేడింగ్ బెల్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సినీ హీరో, మార్షల్ ఆర్ట్స్ ఛైర్మన్ సుమన్ తల్వార్ పాల్గొన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నారు. పలువురు విద్యార్థులకు కరాటేలో వైట్, యెల్లో, బ్లూ, గ్రీన్, బ్రౌన్, ఆరెంజ్, బ్లాక్ బెల్టులు సర్టిఫికెట్లు అందజేశారు.