ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబ్ నగర్: భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడి వైద్యులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే, నేరుగా రోగులతో మాట్లాడుతూ.. వైద్యం సక్రమంగా అందుతుందా అని ప్రశ్నించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.