మాజీ ప్రధానికి నివాళులర్పించిన సీఎం
HYD: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. సెక్రటేరియట్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.