అపోహలను వీడండి: ఎమ్మెల్యే

NLR: నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తల కష్టం ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కార్యకర్తల కష్టాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయమని వారికి అండగా ఉంటామన్నారు. అపోహలను వీడాలని ఆమె కార్యకర్తలను కోరారు. ఎవరికీ అన్యా యం చేయమని, అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎక్కడికైనా వెళ్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె బుచ్చిలో మాట్లాడారు.