'సుజాతనగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

'సుజాతనగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

BDK: సుజాతనగర్ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో MRO కృష్ణ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుసుమ ధర్మ మాట్లాడుతూ.. సుజాతనగర్ మండలంలో సుమారు 1900 ఎకరాల్లో మొక్కజొన్న రైతులు సాగు చేస్తున్నారని, రైతులపై అదనపు భారం పడకుండా సుజాతనగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.