జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన షెడ్యూల్ ఇదే.!
ATP: నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గానికి చేరుకుని, సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉండి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మరోవైపు పార్టీ నాయకులు 400 కార్లతో పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.