VIDEO: మేడే కరపత్రం ఆవిష్కరణ

SRCL: బోయిన్ పల్లి మండలం తడగొండలో గ్రామ హమాలీల ఆధ్వర్యంలో బుధవారం మేడే, కరపత్రం ఆవిష్కరణ చేశారు. మండల కేంద్రంలో మే ఒకటో తేదీన మేడే దినోత్సవం సందర్భంగా కష్టజీవుల ఎర్రజెండాను ఎగరవేయడం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఆ రోజు ఈ మండలంలో ఉన్న అన్ని రంగాల కార్మికులు, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, మహిళా బీడీ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నాలన్నారు.