కేంద్రాన్ని దత్తత తీసుకున్నజిల్లా కలెక్టర్

KMR: లింగంపేట లింగంపేట మండల కేంద్రాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో నాగన్న భావి వద్ద గురువారం రాత్రి పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ తిలకించారు. కూచిపూడి, భరతనాట్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.