తండ్రికి నివాళి అర్పించిన మంత్రి సవిత

తండ్రికి నివాళి అర్పించిన మంత్రి సవిత

సత్యసాయి: మాజీ మంత్రి, దివంగత నేత ఎస్ రామచంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా కుమార్తె, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘన నివాళులు అర్పించారు. పెనుకొండ మండలం కొండంపల్లి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, కూటమి నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తండ్రిని గుర్తు చేసుకుని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.