VIDEO: నామినేషన్ వేయకుండా అడ్డగింత
GDWL: అయిజ మండలం ఉత్తనూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎస్సీ సామాజిక వర్గానికి రావడంతో తమ నామినేషన్ వేయకుండా మరో సామాజిక వర్గం అడ్డుకుంటున్నారని జయమ్మ ఆమె భర్త రామలింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. తమను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఎన్నికల అధికారులు, పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.