VIDEO: నంద్యాలలో CMRF చెక్కుల పంపిణీ
NDL: మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ మంగళవారం పంపిణీ చేశారు. నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో 36 మంది బాధితులకు రూ.23,25,900 విలువైన చెక్కులను అందజేశారు. అర్హులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదలకు వైద్య సాయం అందించడంలో మంత్రి ఎప్పుడూ ముందుంటారని ఫిరోజ్ పేర్కొన్నారు.