'ఎండలు పెరుగుతున్నాయి.. జాగ్రత్త'
GDWL: జిల్లాలో ఏప్రిల్ 13 వరకు ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని డీఎంహెచ్‌వో జే.సంధ్యా కిరణ్మయి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకూడదని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. తెల్లటి దుస్తులు ధరించి, తరచూ నీరు తాగుతూ వడదెబ్బ నుంచి రక్షించుకోవాలని కోరారు.