పుట్టపర్తిని వణికిస్తున్న చలి
సత్యసాయి: పుట్టపర్తిలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉదయం వేళ కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీ సెంటిగ్రేడ్‌గా నమోదైంది. చలి గాలుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, ఇతర రక్షణ దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.