వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై
ప్రకాశం: కంభంలోని స్థానిక కందులాపురం సెంటర్లో మంగళవారం రాత్రి ఎస్సై నరసింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో నేర నియంత్రణ, ప్రజల భద్రతకు రాత్రి వేళలో గస్తీ బలోపేతం చేసి, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.