జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కిమిడి

VZM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం చీపురుపల్లిలోని తన నివాసంలో మాట్లాడుతూ.. వార్డుమెంబర్ పోటీచేసే నాయకుడు ప్రవర్తించే తీరుకన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాష, వ్యవహార శైలి దారుణంగా ఉందని విమర్శించారు.