కోటగుళ్లు గోశాల గోమాతలకు ప్రత్యేక పూజలు

BHPL: గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో శ్రావణమాసం చివరి శుక్రవారం గోశాల గోమాతలకు ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు నాగరాజు కార్యక్రమాలను ప్రారంభించి నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజాలు నిర్వహించగా అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.