పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం
NGKL: వంగూర్ మండలం ఉల్పర గ్రామంలో బుధవారం పశువులకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. డాక్టర్ మల్లేశ్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణకు రైతులు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం.కృష్ణయ్య, వార్డు మెంబర్లు, సిబ్బంది మహేశ్, లక్ష్మణ్, చంద్రశేఖర్, గోపాల మిత్రలు సైదులు పాల్గొన్నారు.