వేంపల్లి UG పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన SP
KDP: వేంపల్లె UG పోలీస్ స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పరిసరాలు పరిశీలించి, పాత నేరస్థులు, సస్పెక్టులపై కఠినంగా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించమని విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వారికి సూచించారు.