'రోడ్డు, నీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'
ADB: ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఉన్న రోడ్డు, నీటి సమస్యలను పరిష్కరించాలని తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని పలు గ్రామపంచాయతీ స్థానాలకు గెలుపొందిన నూతన ఆదివాసీ సర్పంచులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్య సేవలు అందేలా కృషి చేయాలనీ పేర్కొన్నారు.