టేకులగూడెం సర్పంచ్ అభ్యర్థి సందీప్ ఏకగ్రీవం
KMM: సింగరేణి మండలం టేకులగూడెం గ్రామపంచాయతీ సర్పంచిగా గుమ్మడి సందీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీకి చెందిన సందీప్‌ను వివిధ పార్టీలు, ప్రజల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.