సేఫ్‌గా చెన్నై చేరుకున్న హీరో అజిత్

సేఫ్‌గా చెన్నై చేరుకున్న హీరో అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ దుబాయ్ నుంచి సురక్షితంగా చెన్నై చేరుకున్నాడు. పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో ఉన్న ఆయన, ఇవాళ తిరిగి రావడంతో విమానాశ్రయం వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన నటుడికి ఫ్యాన్స్  గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. అజిత్ రాకతో సోషల్ మీడియాలో 'థలా' అభిమానుల సందడి మొదలైంది.