అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

MNCL: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను కన్నెపల్లి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై గంగారం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్‌లను పోలీస్ స్టేషన్ తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.