VIDEO: భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ దుకాణం దగ్ధం
GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో సోమవారం ఒక కాంప్లెక్స్‌లోని పెయింట్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న ఇతర షాపులకు ప్రమాదం తప్పిందని, లేదంటే పెను నష్టం వాటిల్లేదని స్థానికులు తెలిపారు.