మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట: రాజ్‌నాథ్
సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా రూ.5,000 కోట్లతో సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 125 ప్రాజెక్టులను ఆయన ఇవాళ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో సైన్యం వేగంగా స్పందించేందుకు ఇవి సహాయపడుతాయని తెలిపారు. దేశ సేవలో అమరులైన వీరులకు ఈ ప్రాజెక్టులను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.